హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..నేడు 36 ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

-

హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ షాక్‌ తగిలింది. హైద‌రాబాద్, సికింద్రాబాద్ లోని ప‌లు ఎంఎంటీఎస్ రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ రద్దు చేసింది. నేడు జంట న‌గ‌రాల్లో ప‌లు రూట్ల‌లో ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండ‌వ‌ని అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించింది రైల్వే శాఖ. అయితే హైద‌రాబాద్, సికింద్రాబాద్ న‌గ‌రాల్లో కొన్ని రూట్ల‌లో ట్రాక్ మ‌ర‌మ్మ‌తులు కొన‌సాగుతున్నాయ‌ని… ట్రాక్ మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే కొన్ని రూట్ల‌లో ఎంఎంటీఎస్ స‌ర్వీస్ ల‌ను ర‌ద్దు చేశామ‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఎంఎంటీఎస్ స‌ర్వీస్ పై ర‌ద్దు ఉంటుంద‌ని తెలిపారు. తిరిగి మంగ‌ళ వారం నుంచి అన్ని రూట్ల‌లో ఎంఎంటీఎస్ స‌ర్వీస్ లు మ‌ళ్లీ పునః ప్రారంభం అవుతాయ‌ని వెల్ల‌డించారు. ఇవాళ ఒక్కరోజే జంట న‌గ‌రాల్లో న‌డుస్తున్న మొత్తం 79 ఎంఎంటీఎస్ స‌ర్వీస్ ల‌లో 36 రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. అలాగే సంక్రాంతి సెల‌వుల నేప‌థ్యంలో న‌గ‌రంలో ఎంఎంటీఎస్ లలో ర‌ద్దీ త‌గ్గ‌డంతో ట్రాక్ మ‌ర‌మ్మ‌తులు చేస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం స‌మ‌యంలో ఎంఎంటీఎస్ స‌ర్వీస్ లు రద్దు చేసినా.. ప్ర‌భావం ఎక్కువ ఉండ‌ద‌ని తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news