ఎంఎంటీఎస్ రైళ్ళు ర‌ద్దు..

-

హైద‌రాబాద్ జంట‌న‌గ‌రాల్లో ఎంఎంటీఎస్ రైళ్ళో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌కు పిడుగులాంటి వార్త ఇది. నిత్యం ఎంఎంటీఎస్ రైళ్ళ‌తో ప్ర‌యాణం చేసే న‌గ‌ర‌జీవుల‌కు నిజంగా ఇది చేదువార్తే అయినప్పటికి అప్పుడ‌ప్పుడు ఇవి త‌ప్ప‌వు.. అయితే మీరు గుండెరాయి చేసుకుని ఈ వార్త వినాల్సిందే.. సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

జంట‌న‌గరాల్లో ఇటు అటూ అటు నుంచి టూ ప్ర‌యాణికుల‌ను చేర‌వేసే రైళ్ళ‌కు ఈరోజు సెల‌వు పాక్షికంగా సెల‌వు ప్ర‌క‌టించారు. మ‌నుషుల‌ను ర‌వాణా చేసి చేసి రైళ్ళు, ప‌ట్టాలు, క‌రెంట్ వైర్లు అలిసిపోయాయ‌ట‌.. అందుకే కాస్త రిలీఫ్‌, ఏమైనా ఉంటే మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటాం.. అందుకే మాకు ఈరోజు కాస్తంతా రిలీఫ్ ఇచ్చార‌ని ఎంఎంటీఎస్ రైళ్ళు అనుకుంటున్నాయి. అయితే ఫ‌ల‌క్‌నుమా – లింగంప‌ల్లి న‌డుమ న‌డిచే రైళ్ళే ఈరోజు  ఫలక్ నుమా – సికింద్రాబాద్ వరకు పరిమితమవుతాయట‌.

అలాగే నాంపల్లి – ఫలక్ నుమా సర్వీసులు సికింద్రాబాద్ – ఫలక్ నుమా మధ్య రద్దు కానున్నట్లు తెలిపారు. కేవలం ట్రాక్ మరమ్మత్తుల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ట్రాక్ మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి కాగానే తిరిగి య‌ధావిధిగా ఎంఎంటీఎస్ రైళ్ళను న‌డుపుతామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఇప్పుడు  ఎంఎంటీఎస్ రెండో దశ మొదటి భాగాన్ని 2019 అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఏప్రిల్ నెలలో రెండో దశ ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయాణీకులను ఆకర్షించేందుకు రైళ్లకు సరికొత్త రూపాన్ని తెచ్చారు. ఇప్పటిదాక లేత నీలం రంగులో క కనిపించిన రైళ్లన్నీ..ముదురు గులాబీ వర్ణంలో మెరిసిపోతున్నాయి. అంతేగాకుండా కొన్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. భద్రమైన, చవకైన రవాణా ఎంఎంటీఎస్ జంటనగరాల ప్రజల ఆదరణ పొందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version