పీతలను నైవేద్యంగా పెట్టే దేవాల‌యం.. ఎందుకో తెలుసా..!

-

ఈ భూప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు జ‌రుగుతుంటాయి. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతుంటాయి. ఇక మ‌న దేశం ఎన్నో చారిత్రక‌, పురాత‌న దేవాల‌యాల‌కు నిల‌యం. ఎన్నో శ‌తాబ్దాల కింద‌ట నిర్మించినా ఇప్ప‌టికీ చెక్కు చెద‌రని ఆల‌యాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆల‌య ప‌రంగా ఎంతో పురాణ విశిష్ట‌త‌ను క‌లిగి ఉన్నాయి. అయితే గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాల‌యం మాత్రం చాలా భిన్న‌మైంది. ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా భ్రతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు విచిత్రం.

సూరత్ గుజరాత్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఆధ్యాత్మిక పరంగా కూడా సూరత్ చాలా ప్రసిద్ది చెందినది అందుకు నిదర్శనం గుజరాత్ సముద్రం తీరంలో ఉన్న శివాలయం. అయితే శివుడిని నమ్మకంతో ఆరాధిస్తే ఎలాంటి కోరికలనైనా తీర్చగలడని విశ్వసిస్తారు. సూరత్‌లోని శివ భక్తులు కూడా అలాగే నమ్ముతున్నారు. ఉమ్రాలో రామ్‌నాథ్ శివ ఘేలా దేవాలయం ఉంది.

ఇక్కడి మహాశివుడికి పీతలను సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం భక్తులకు ఉంది. అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, పీతలను శివునికి సమర్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. తమ చెవులకు వచ్చే అనారోగ్యాలు నయమవుతాయని చెప్తున్నారు. ఇక్కడికి శివరాత్రి సందర్భంలో యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అలాగే సూరత్ ప్రపంచ వస్త్ర, వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version