అవమానాలు మోసిన కెప్టెన్ ద్రావిడ్…!

-

టీం ఇండియాలో గంగూలీ తర్వాత కెప్టెన్ బాధ్యతలు ఎవరు అనే ప్రశ్న అప్పట్లో చాలా ఎక్కువగా వినపడేది. 2003 ప్రపంచకప్ టీం ఇండియా ఓడిపోయినా సరే గంగులీని నినదించలేదు అభిమానులు ఎవరూ. కెప్టెన్ గా అతను తప్పుకోవాలని కూడా పెద్దగా ఎవరూ డిమాండ్ చేయలేదు కూడా. అయితే ఆ తర్వాత బాధ్యతలను ఇద్దరు ముగ్గురు పోషించారు గాని ద్రావిడ్ వచ్చిన తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది.

2005-2006 సీజన్ లో అనుకుంట టీం ఇండియా వరుసగా ఓడిపోయింది. వెస్టిండీస్ సీరీస్ కి వెళ్లి వచ్చిన టీం ఇండియా, ఆ తర్వాత గెలిచినవి పెద్దగా ఏమీ లేవు. ఆ సమయంలోనే 2007 ప్రపంచకప్ వచ్చింది. లీగ్ దశలో టీం ఇండియా ఘోరంగా ఓడిపోయింది. అప్పుడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్న బంగ్లాదేశ్ జట్టు మీద టీం ఇండియా ఓడిపోవడం అనేది చాలా మంది అభిమానులు తట్టుకోలేకపోయారు.

అందరూ ద్రావిడ్ నే నిందించారు. అప్పుడు కెప్టెన్ గా ద్రావిడ్ ఏ ఉన్నాడు. బహుశా విలేఖర్లు కూడా మీడియా సమావేశాల్లో ద్రావిడ్ ని పరోక్షంగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ద్రావిడ్ మాత్రం ఆ నిందను మోస్తూనే వచ్చి, ఆత్మవిశ్వాసంతో ముందుకి వెళ్తాం అనే మాట మాత్రమే మాట్లాడేవాడు. చాలా మందికి తెలియంది ఏంటీ అంటే, గంగూలీ తిరిగి టీంలోకి రావడం ఒక ఆటగాడికి ఇష్టం లేదు.

దీనితో జట్టులో వర్గాలు తయారు అయి, జట్టు ప్రదర్శన మీద ప్రభావం పడింది. బంతి విసరడం రాని వాడు కూడా అప్పట్లో టీం ఇండియా బౌలర్ అయ్యాడు. ఫిట్నెస్ లేని ఎందరో ఆటగాళ్లను విదేశీ టూర్లకు పంపారు. అయినా సరే అన్ని అవమానాలను భరిస్తూ ద్రావిడ్ టీం ని ముందుకి నడిపించాడు. ఆ సమయంలో ద్రావిడ్ పడిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. బహుశా ప్రపంచ క్రికెట్ లో ఆ స్థాయి అవమానాలు ఎవరూ పడలేదు ఏమో.

Read more RELATED
Recommended to you

Latest news