కరెంట్ స్తంభాన్ని ఢీకొని కారు పల్టీలు కొట్టడంతో ఒకరు స్పాడ్ డెడ్ అయ్యారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం..రంజాన్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్‌కు నజీర్ (40) వెళ్తున్నాడు.
తన మారుతి కారులో వాళ్ల అమ్మమ్మ ఊరికి వెళ్తుండగా బిజినేపల్లి మార్గం మధ్యలో నిద్రలోకి జారుకున్నాడు. దీనికి తోడు కారు ఓవర్ స్పీడులో ఉండటంతో కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో నజీర్ అక్కడికక్కడే మృతి చెందగా.. తన భార్య ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నజీర్ తలకు బలంగా గాయం కావడంతో స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు.అతన్ని నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.