తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్షాలకు హితవు పలికారు. నిన్న అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి శుక్రవారం ఉదయం ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.
‘ఫ్యూచర్ సిటీ అనేది యూ-టర్న్ కాదని, హైదరాబాద్ యొక్క నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి రైట్ టర్న్. అన్ని తెలిసిన నాయకుడు అయ్యుండి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంటే చూడటానికి నిరుత్సాహంగా ఉంది. ఫోర్త్ సిటీ అని కూడా పిలువబడే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్.. గ్రేటర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది’ అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.