తెలంగాణలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మెదక్, కామారెడ్డి జిల్లాలకు IMD హైదరాబాద్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రేపు ఉదయం వరకు కొన్ని జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఆ కారణంగా పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, జనగాం, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఇక భారీ వర్షాల తరుణంలో మెదక్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు హాలిడే ఇచ్చారు.