తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న పాత్రలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచారు కైకాల సత్యనారాయణ.. నా కేవలం విలన్ పాత్రలు మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు తన కెరీర్ మొత్తంగా దాదాపు 750 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన నట ప్రస్థానం నిజంగా చిరస్మరణీయం అనే చెప్పాలి… ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే ఎన్నో పాత్రలతో అభిమానులకు దగ్గరైన నటుడు కైకాల..
కైకాల పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. అలాగే హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు.. ఈయన నటించిన ప్రతి పాత్ర ఒక అద్భుతమైన చెప్పాలి.. 1960లో వచ్చిన యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనుకు ఒక పాత్రనిచ్చారు… ఇదే కైకాల మొదటి చిత్రం ఈ సినిమా తర్వాత విఠలాచార్య ఈయనలో ఒక ప్రతి నటుడు ఉన్నాడని గ్రహించి ఆ కొరతను భర్తీ చేయవలసిందిగా కోరారు అప్పటినుంచి ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి 1962 నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎన్నో విభిన్న చిత్రాల్లో నటించారు.. అందులో ‘స్వర్ణగౌరి’లో శివుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘మదన కామరాజు కథ’లో ధర్మపాలుడిగా, ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’లో ప్రాణ్ గెటప్‌లో.. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసనునిగా నటించారు. విఠలాచార్య ‘అగ్గి పిడుగు’లో రాజనాల ఆంతరంగికునిగా కనిపించి ఆకట్టుకున్నారు.
అలాగే ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’లో సుయోధనుడిగా, ‘దాన వీర శూరకర్ణ’లో భీమునిగా, ‘సీతా కల్యాణం’లో రావణాసురుడిగా, అసమాన నటన ప్రదర్శించారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించిన సత్యనారాయణ తన కెరీర్ లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అయితే కేవలం పౌరాణిక చిత్రాల్లో మాత్రమే కాకుండా సాంఘిక చిత్రాల్లో సైతం తన నటనతో అబ్బురు పరిచారు అలాగే ప్రేమనగర్ లో కేశవ వర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారని చెప్పవచ్చు అలాగే ఎన్టీఆర్ అడవిరాముడు వేటగాడు సినిమాల్లో సైతం అద్భుత నటన కనబరిచారు..