రాంగోపాల్‌ వర్మపై కేసు నమోదు..!

-

తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య నేపథ్యంలో మర్డర్‌ అనే సినిమా తీయనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అలాగే సినిమా తన కుమారుడి హత్యా కేసును ప్రభావితం చేసే అవకాశముందని ప్రణయ్ తండ్రి నల్గొండ ఎస్సి, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ను విచారించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

సినిమా షూటింగ్ నిలిపేయాలనే డిమాండ్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బాధితుల సమ్మతి లేకుండా సినిమా తీయడం సరికాదని బాలస్వామి తరఫున వాదనలు వినిపించిన లాయర్ తెలిపారు. దాంతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సి, ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫాదర్స్ డే సందర్భంగా వర్మ తన సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ఓ తండ్రి కుమార్తెను అతిగా ప్రేమిస్తే ఎంత ప్ర‌మాద‌మో తెలిపే అమృత‌, మారుతీరావు క‌థ‌తో తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రం హృద‌యాల్ని క‌దిలిస్తుంది’ అని వర్మ ట్వీట్ వివాదాస్పద ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news