ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంపై కేసున‌మోదు..!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంపై పోలీస్ కేసు న‌మోద‌య్యింది. మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెల్ లో ఓ గుర్రం మ‌ర‌ణించ‌డంతో ఆయ‌నపై కేసు న‌మోదయ్యింది. పెటా ఇండియా మ‌ణిర‌త్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యాన‌ర్ మ‌రియు గుర్రం య‌జ‌మానిపై కూడా కేసు న‌మోదు చేసింది. వారి ఫిర్యాదు మేర‌కు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి.

manirathnam
manirathnam

గుర్రం అల‌స‌ట‌..డీ హైడ్రేష‌న్ గురైంద‌ని అయినప్ప‌టీ దానిని షూటింగ్ కు ఉప‌యోగించ‌డంతో అది మ‌ర‌ణించింద‌ని పెటా ఇండియో ఆరోపిస్తుంది. అంతే కాకుండా దేశంలో షూటింగ్ ల కోసం నిజ‌మైన జంతువుల‌ను కాకుండా గ్రాఫిక్స్ ను వాడాల‌ని పెటా డిమాండ్ చేస్తుంది. ఇదిలా ఉండ‌గా షూటింగ్ ల సమ‌యంలో జంతువుల‌ను క‌ష్టపెట్ట‌డం నేరం అన్న సంగ‌తి తెలిసిందే.