ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్…రూ.1,42,000 వేతనం..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్) డివిజన్ స్పోర్ట్స్ కోటాలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం వివరాలని చూస్తే..

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency
ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency

ఫుల్ టైమ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ లాంటి పోస్టులు ఉన్నాయి. అయితే కేవలం 28 ఖాళీలే వున్నాయి. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. అంటే అప్లికేషన్స్ రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి. ఇది ఇలా ఉంటే
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, కబడ్డీ, హాకీ, కరాటే లాంటి క్రీడల్లో రాణించినవారు అప్లై చేయొచ్చు.

ఇక విద్యార్హతల విషయంలోకి వస్తే.. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. గంటకు 8,000 పదాలు డేటా ఎంట్రీ చేయాలి. అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. వయస్సు అయితే 18 నుంచి 30 ఏళ్లు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు జనరల్, ఓబీసీ కేటగిరీలో 5 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలో 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 30 చివరి తేదీ. శాలరీ వివరాలని చూస్తే.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.56,900, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు రూ.81,100, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టుకు రూ.1,42,400 వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థులు https://www.incometaxindia.gov.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలని చూడచ్చు.

పోస్టుల వివరాలు:

ట్యాక్స్ అసిస్టెంట్-13
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -12
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్- 3

చిరునామా:

Income Tax Officer (Hq)(Admn),
O/o Principal Chief Commissioner of Income Tax,
UP (East), Aayakar Bhawan,
5-Ashok Marg,
Lucknow-226001.

Read more RELATED
Recommended to you

Latest news