ఆగస్టులో దేశంలోని 16లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయరని సెంటర్ ఫర్ ఇండియన్ మానిటరింగ్ ఎకనమీ నివేధిక ప్రకటన చేసింది. ఆగస్టులో నిరుద్యోగం 8.32 శాతంగా ఉంటుందని పేర్కొంది. గ్రామీణ నిరుద్యోగం 7.64శాతం గా ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే పట్టణ నిరుద్యోగం 9.78శాతంగా ఉంటుందని వెల్లడించింది.
జులై నెలలో ఉపాధి పొందిన వారు 399.38 మిలియన్లు ఉండగా… ఆగస్టు వరకు 397.78 మిలియన్లకు తగ్గింది. అంటే పదహారు లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయి నిరుద్యోగులుగా మారారని వెల్లడించింది. ఇక దేశంలో అత్యధికంగా హర్యానాలో నిరుద్యోగం శాతం నమోదవగా రాజస్థాన్, త్రిపుర, బీహార్,జార్కండ్ రాష్ట్రాల్లో తక్కువ శాతం నిరుద్యోగం నమోదయింది.