బ్రేకింగ్ : ఎంపీ రామ్మెహ‌న్ నాయుడిపై కేసున‌మోదు..!

ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మ‌రియు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడుల‌పై టెక్క‌లి పోలీసు స్టేష‌న లో కేసు న‌మోదు అయ్యింది. నిన్న నందిగామ లో జ‌రిగిన ఎన్టీఆర్ ఎర్ర‌న్నాయుడుల విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో వీరు పాల్గొన్నారు. అంతే కాకుండా ఈ కార్య‌క్ర‌మానికి ర్యాలిగా వ‌చ్చిన మ‌రో 48 టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై కూడా కేసులు న‌మోద‌య్యాయి.

rammohan naidu

ర్యాలీ సంధ‌ర్బంగా వీరు క‌రోనా నిబంధ‌న‌లు ఉల్ల‌గించార‌ని అదే విధంగా మోటార్ వాహ‌న చ‌ట్టాన్ని కూడా ఉల్ల‌గించార‌ని స్థానిక వీఆర్ఓ ఆరంగి మ‌హేశ్వ‌ర‌రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. అయితే దీనిపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా క‌రోనా నిబంధ‌న‌లు…వాహ‌న చ‌ట్టాలు గుర్తు రావ‌ని కానీ టీడీపీ ర్యాలీ చేస్తుందంటే అన్ని రూల్స్ గుర్తు వ‌స్తాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.