Adavi sesh : “మేజర్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు… గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ కథాంశాలతో… వస్తువు ప్రేక్షకులను అడవిశేషు మెప్పిస్తూ ఉంటాడు. క్రైమ్ మరియు సస్పెన్స్ ఎలా వెరైటీ కథలను ఎంచుకుని ఓరేంజ్ హీరోగా ఎదిగారు అడవి శేషు. ప్రస్తుతం మేజర్ సినిమా చేస్తున్నాడు అడవి శేషు.

26/11 టెర్రరిస్ట్ దాడిలో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండాపోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా మేజర్. శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు అడవి శేష్. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ మరియు శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అలాగే మురళి శర్మ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మేజర్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన మేజర్ సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది మేజర్ టీం.

Read more RELATED
Recommended to you

Latest news