అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు న‌మోదు

-

ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ పై ఇవాళ సంతోష్ న‌గ‌ర్‌లోని పోలీసు స్టేష‌న్‌లో కేసు బుక్కైంది. ఐపీసీలోని 353 (విధులను అడ్డుకోవ‌డం)తో పాటు ఇత‌ర కొన్ని సెక్ష‌న్ల కింద కేసును న‌మోదు చేసిన‌ట్లు డీసీపీ రోహిత్ రాజు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న అక్బ‌రుద్దీన్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ల‌లితాబాగ్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మయంలో.. ప్ర‌చారం ముగించాల‌ని స్థానికంగా విధులు నిర్వ‌స్తున్న పోలీసు ఆఫీస‌ర్ కోరారు.

ఆ స‌మ‌యంలో పోలీసు ఆఫీస‌ర్‌పై అక్బ‌రుద్దీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల అస‌దుద్దీన్ ఓవైసీ ఇవాళ స్పందించారు. తనను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. తాను కనుసైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదని, తనలో అదే దమ్ము ఉందన్నారు. అక్బరుద్దీన్‌తో పోటీపడేందుకు వస్తున్నారు.. రానీయండి ఎలా గెలుస్తారో చూద్దామన్నారు. పోలీసులను బెదిరించిన నేపథ్యంలో సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో అక్బరుద్దీన్ పై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news