బ్రేకింగ్‌: మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పై కేసు నమోదు అయింది. నిన్న రామతీర్థం ఘటనపై ఆలయ ఈవో ప్రసాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామతీర్థం లోని రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి, అలాగే విధులకు ఆటంకం కలిగించాలని మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు పై ఫిర్యాదు చేశారు ఆలయ ఈవో ప్రసాద్.

ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు… 473,353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నెల్లిమర్ల పోలీసులు. కాగా నిన్న.. రామతీర్థం కొండ పై రామాలయ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి హాజరయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అశోక్ గజపతిరాజు ను కొబ్బరికాయ కొట్టకుండా వెల్లంపల్లి అడ్డుకున్నారు. దీంతో శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేశారు అశోక్ గజపతి రాజు అనుచరులు. దీంతో ఈ వివాదం చెలరేగింది.