వింత: విమానం లో పైలట్ పై పిల్లి దాడి… ఆఖరికి…!

-

Plane, cat attacks pilot, emergency landing, Sudan Torco Flight, Khartoum International Airport విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పిల్లి పైలట్ పై దాడి చేయడం వల్ల అరగంట సేపు విమానం గాలి లోనే ఉండి పోయింది. ఈ పిల్లి కాక్‌పిట్‌ లో పైలట్ ‌పై దాడి చేసి బీభత్సం సృష్టించింది.

దీనితో పైలెట్ ఆ పిల్లి కారణంగా విమానాన్ని గాల్లోనే యూటర్న్ చేసి సుడాన్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసారు. అయితే ఖతార్ రాజధాని అయిన దోహాకు వెళ్ల వలసిన ఈ విమానం, సమయానికే బయలు దేరింది. కానీ పిల్లి చేసిన హడావిడికి సుడానీస్‌ రాజధాని నగరమైన ఖార్టూమ్‌ లోనే మళ్ళీ విమానం దిగాల్సి వచ్చింది.

ఈ సంఘటన బుధవారం జరిగింది. స్టొవవే ఫిలైన్ జాతికి చెందిన ఈ పిల్లి అసలు విమానం లోకి ఎలా వెళ్ళింది అనేది ఆశ్చర్య పరుస్తోంది. కాక్‌పిట్‌లో దీన్ని గమనించి, బయటకు పంపేయడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. అది కెప్టెన్ ‌పై కూడా దాడి చేసింది. కాక్ పిట్ ‌లో ఏర్పడిన ఈ బీభత్సానికి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

ప్రయాణికులంతా సురక్షింతం గానే ఉన్నారు. ఇది ఇలా ఉండగా పిల్లి ఎలా వచ్చింది అనేది స్పష్టం కాలేదు. విమానం లోపల క్లీన్ చేసేటప్పుడో, లేదంటే ఇంజనీరింగ్ చెక్ చేసేటప్పుడో ఇది ఎక్కడైనా ఉండి పోయిందేమో అని అంటున్నారు. ఏది ఏమైనా విమానం లో పిల్లి సృష్టించిన బీభత్సానికి పైలట్ల తో పాటు ప్రయాణికులు, అధికారులు అంతా కూడా భయ పడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news