”మాచర్ల నియోకవర్గం” నుంచి బిగ్‌ అప్డేట్‌.. సెకండ్‌ హీరోయిన్‌ గా కేథరిన్ !

-

టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో నితిన్‌ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ లో ఉన్నాడు. ప్రస్తుతం నితిన్‌ మాచర్ల నియోజక వర్గం సినిమా చేస్తున్నాడు. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో… ఆదిత్య మూవీస్‌ అండ్‌ ఎంటర్‌ టైన్ మెంట్స్‌, శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్స్‌ పై ఎం ఎస్‌ రాజ శేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో… ఈ సినిమా తెరకెక్కుతోంది. మాచర్ల నియోజక వర్గం సినిమాను సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా లో నితిన్‌ సరసన కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తుంది. అయితే.. తాజాగా మాచర్ల నియోజక వర్గం సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా లో కృతి శేట్టి తో పాటు మరో హీరోయిన్‌ నటిస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమా కేథారిన్‌ రెండో హీరోయిన్‌ గా నటిస్తోందని… అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఇక ఈ అప్‌ డేట్ తో అందరిలోనూ ఉత్సాహం నెలకొంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news