తెలంగాణ రాష్ట్రంలో భూ తగాదాలను పూర్తిగా కూకటి వేళ్ళతో పెకలించాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకు వచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి KTR స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ప్రజలు ప్రశాంతంగా వారి ఆస్తులపైన హక్కులు పొందేలా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆస్తులకు ప్రభత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా అనేక విషయాలు ప్రజల దృష్టికి తీసుకు వచ్చారు. ప్రజల నుంచి ప్రభుత్వం అదనంగా డబ్బులు ఎట్టి పరిస్థితులలో వసూలు చేయబోదని, ఆస్తుల నమోదుకు సంబంధించి దళారులను ఎవరూ గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పారు. ఇలాంటి విషయంలో ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని KTR ప్రజలకు సూచించారు. ఈ నేపథ్యంలో రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి అని KTR ఆదేశించారు.