వివేకా మర్డర్ కేసు : హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

కడపలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వివేకా హత్య కేసుని ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సంస్థ విచారణ పై ఏపీ హైకోర్టుకు వెళ్ళడం సంచలనంగా మారింది. నిజానికి సి.బి.ఐ వివేకా హత్య కేసుకు సంబందించిన రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మెజిస్ట్రేట్ ను కోరింది. అయితే అలా ఇచ్చేందుకు తమకు ఆదేశాలు లేవని ఆ రికార్డులన్నీ ఇవ్వడానికి మెజిస్ట్రేట్ నిరాకరించారు.

దీంతో రికార్డులన్నీ తమకు ఇచ్చేలా కింది కోర్టుని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది సీబీఐ. అయితే ఈ పిటిషన్ ని హైకోర్టు వాయిదా వేసింది. ఇక నిజానికి సీబీఐ ఈ కేసుని సీరియస్ గా తీసుకుంది. కొన్ని రోజుల పాటు సుదీర్ఘ విచారణలు కూడా చేసింది. అయితే ఆ టీం అంతా కరోనా బారిన పడడంతో ఢిల్లీకి తిరిగి వెళ్ళి పోయింది. ఆ స్థానంలో కొత్త టీం వచ్చి దర్యాప్తు మొదలు పెట్టింది.