పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కస్టడీని మరోసారి పొడిగించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. మరో 14 రోజులు పొడిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో గతంలో ఈడీ అధికారులు ఆయణ్ను అరెస్ట్ చేశారు. సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ ముగియడంతో ఇప్పుడు మరో 14 రోజులు పొడిగించింది.
ఈ కేసులో మంత్రి పార్థాతోపాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, కొందరు మాజీ అధికారులు నిందితులుగా ఉన్నారు. అర్పిత ఇంట్లో ఈడీ అధికారులకు రూ.21 కోట్ల నగదు లభ్యమైంది. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. ఈ కేసులో అప్పటి ఆయన ఓఎస్‌డీ పీకే బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంత ఆచార్జి కూడా నిందితులే. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు.