సీబీఐ కోర్టులో ఇవాళ ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఈ సందర్భంగా పెన్నా కేసులో సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని సిఎం జగన్ కోరారు. అటు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది.
పెన్నా ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని కోరారు సబితా ఇంద్రారెడ్డి. అయితే సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను ఈ నెల 22 కి వాయిదా వాయిదా వేసింది సీబీఐ కోర్టు. అలాగే ఇండియా సిమెంట్స్ కేసు విచారణను ఈ నెల 28 కి వాయిదా వేసింది. కాగా ఏపీ సిఎం జగన్.. గతం లో అక్రమాస్తుల కేసులో జైలు కు వెళ్ళిన సంగతి తెలిసిందే.