తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి… పార్టీలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పిసిసి బాధ్యతలు చేపట్టిన అనంతరం నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీని… నిలదీస్తూ నే ఉన్నారు. అలాగే పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే… కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు పార్టీలోకి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి.
ఈ నేపథ్యంలోనే ఇవాళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. స్వయంగా రేవంత్ రెడ్డి… కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు. కాంగ్రెస్లోనే కొనసాగాలన్న కొండా తో రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది.
అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి బిజేపి తీర్థం పుచ్చుకుంటారని కూడా ప్రచారం జోరుగా సాగింది.