BREAKING : వైఎస్ వివేకా హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో 5 గురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి, శివ శంకర్ రెడ్డిలైన ఐదుగురికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
కాగా, సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నానంటూ లేఖ రాశారు అవినాష్ రెడ్డి. ఈ కేసు విచారణ పారదర్శంగా సాగాలని కోరుతున్నా.. ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించాలని కోరారు. తనతో పాటు న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని వెల్లడించారు వైఎస్ అవినాష్‌రెడ్డి.