ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, గుంటూరు, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
300 కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి రుణం గా రాయపాటి కంపెనీ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రాయపాటి తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో.. కంపెనీ పై సి.బి.ఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీలోనూ, సీఈవో ఇళ్లపై కూడా సీబీఐ అధికారులు సోధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది.