దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి ధరలూ..

-

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర ఈ రోజు స్వ‌ల్పంగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం నాటి ధరతో పోలిస్తే 20 రూపాయలు తగ్గి 40,670 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయలు తగ్గింది. దీంతో 37,270 రూపాయల వద్దకు చేరింది. కాగా, వెండి ధర కూడా ఈరోజు స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 49,300 రూపాయల వద్దకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పది గ్రాములకు 50 రూపాయలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,250 రూపాయల వద్ద చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 38,050 రూపాయలకు దిగి వచ్చింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు తగ్గిడ్ని. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 49,300 రూపాయల వద్దకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news