మోసం చేస్తున్న మొబైల్ ఇన్సురెన్స్ కంపెనీలు…!

-

వినియోగదారులను మొబైల్ భీమా కంపెనీలు మోసం చేస్తున్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ ధర ఎక్కువగా ఉండటంతో ఫోన్ కొనే సమయంలోనే వినియోగదారులు భీమా చేయిస్తున్నారు. ఇందుకోసం ఫోన్ ఖరీదులో కొంత శాతం విక్రయదారులు వసూలు కూడా చేస్తున్నారు. అయితే అవి ఎంత వరకు న్యాయం చేస్తున్నాయి…? ఎంత వరకు వినియోగదారులకు లబ్ది చేకూరుతుంది అంటే సమాధానం చెప్పడం కాస్త కష్టమే.

ఉదాహరణకు ఒక ఐఫోన్ 6 మోడల్ ని కొనుగోలు చేసిన తర్వాత ఒక సంస్థ ద్వారా విక్రయదారుడు భీమా చేయిస్తాడు. అందులో ఫోన్ ధరలో కొంత అంటే ఒక రెండు వేలో, మూడు వేలో వసూలు చేసి భీమా చేస్తాడు. ఆ ఫోన్ కొన్న గంటకు ట్రాఫిక్ లో వెళ్ళినప్పుడు జేబులో నుంచి జారి పడిపోతే దానికి భీమా ఉంది కదా అని వెళ్తే, ఆ కాగితాలు ఈ కాగితాలు అని తిప్పించుకోవడమే గాని పని మాత్రం జరగడం లేదు. థర్డ్ పార్టీ నుంచి ఎవరైతే భీమా చేయిస్తున్నారో వాళ్లకు కచ్చితంగా న్యాయం అనేది జరగడం లేదు.

వేల రూపాయలు పోసి ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత ధైర్యంగా భీమా ఉంది కదా అని వెళ్తే, ట్రాఫిక్ నిభంధనల ప్రకారం ఫోన్ మాట్లాడకూడదు, ట్రాఫిక్ లో పడితే సంబంధం లేదు, జేబులో నుంచి జారి పడితే సంబంధం లేదు, అంటూ వినియోగదారుడికి చుక్కలు చూపిస్తున్నారు. ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థలు అన్నింటిలోను పరిస్థితి ఈ విధంగానే ఉంది అనేది వాస్తవం. చాలా మంది వినియోగదారులు వాటి వలన నష్టపోతున్నారు. అలాంటప్పుడు వినియోగదారుల ఫోరం లో ఫిర్యాదు చేస్తే మాత్రం మీకు న్యాయం జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు. జరిమానాతో సహా చెల్లిస్తారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news