భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఏపీ మాజీ సిఎం చంద్రబాబు సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులను సీఎం జగన్, మంత్రులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గాల్లో ప్రదక్షిణ చేసి జగన్ చేతులు దులుపుకున్నారని కానీ ఎక్కడికెళ్లినా మంత్రులను చుట్టుముట్టి బాధిత ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు.
కుటుంబానికి 500 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని, విపత్తుల్లో పని చేయలేక ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు. ఇల్లు వారం రోజులు మునిగితేనే’’ నిత్యావసరాలు ఇస్తామని అనడం కన్నా దుర్మార్గం ఇంకోటి లేదని బాబు అన్నారు. ముంపు నష్టానికి, ప్రభుత్వ సాయానికి తూకం వేయడం దారుణమని చంద్రబాబు విమర్శించారు. పోలవరం పనులు ఎందుకని రద్దు చేశారు..? వాటిని రద్దు చేయకపోతే ఈ పాటికి పూర్తయ్యేదని ఆయన అన్నారు .