సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాల విడుద‌ల‌.. 88.78 శాతం మంది పాస్‌..

-

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు సోమ‌వారం విడుద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే సీబీఎస్ఈ బోర్డు క‌రోనా కార‌ణంగా ప‌లు వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇదే విష‌యాన్ని బోర్డు జూన్ 26వ తేదీన సుప్రీం కోర్టుకు తెలిపింది. జూలై 15వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామ‌న్నారు. చెప్పిన‌ట్లుగానే ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

cbse class 12 exam results announced

కాగా ర‌ద్ద‌యిన ప‌రీక్ష‌ల‌కు గాను సీబీఎస్ఈ ప్ర‌త్యామ్నాయంగా మార్కుల‌ను అసెస్‌మెంట్ చేసింది. విద్యార్థి ఇప్పటికే రాసిన ప‌రీక్ష‌ల మార్కుల ఆధారంగా ర‌ద్ద‌యిన ప‌రీక్ష‌ల‌కు మార్కుల‌ను ఇచ్చారు. విద్యార్థులు కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న Umang యాప్‌లోనూ ఫ‌లితాల వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఈ ఫ‌లితాల వివ‌రాల‌ను విద్యార్థులు cbseresults.nic.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి తెలుసుకోవ‌చ్చు.

ప‌రీక్ష‌ల్లో మొత్తం 38,686 మంది విద్యార్థులు (3.24 శాతం మంది) 95 శాతానికి పైగా మార్కుల‌ను సాధించార‌ని బోర్డు తెలిపింది. మొత్తంగా 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. గ‌తేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణ‌త శాతం పెరిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రీక్ష‌లు పాసై వారికి విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news