టీచర్ ఏంటి ఇలాంటి పని చేసిందని ఆశ్చర్యంలో తల్లితండ్రులు…!

-

కరోనా కారణంగా అన్ని స్కూల్స్ మూతబడ్డాయి. దీనితో ఆన్లైన్ క్లాసులు ద్వారా పిల్లలకు పాటాలు చెబుతున్నారు. అయితే ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ పిలల్లకు చెప్పే పాఠాలు గూర్చి తెలిస్తే ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే… జార్ఖండ్ లోని కిండర్ గార్డెన్ అనే ఓ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ మన భారతీయ జాతీయ గీతం తోపాటుగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జాతీయ గీతాలను నేర్పిస్తున్న వైనం ఒకటి బయటకు వచ్చింది. ఈ వ్యవహారం బయటపడతంతో తీవ్ర స్థాయిలో ఆ టీచర్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

online classes
online classes

సదరు టీచర్‌ జాతి వ్యతిరేకని సోషల్‌ మీడియాలో తిట్టిపోస్తున్నారు. తూర్పు సింఘ్ ‌భూమ్‌ జిల్లా జంషెడ్‌పూర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వెలుగుచూసిన ఈ ఉదంతంపై జిల్లా విద్యాశాఖ యంత్రాంగం విచారణ చేపట్టింది. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు ఆన్‌లైన్‌ లో పాఠాలు చెప్తున్న ఓ టీచర్‌ బంగ్లా, పాక్‌ జాతీయ గీతాలు నేర్చుకోవాలని చెప్పింది. వాటికి సంబంధిచిన యూట్యూబ్‌ లింకులను వారికి షేర్‌ చేసింది. వేరే దేశాల జాతీయ గీతాలు నేర్చుకోవడమేంటని పిల్లల తల్లిదండ్రులు తికమకపడ్డారు.

కొందరు అయితే దీనిని వ్యతిరేకించారు. ఇదేంటని అభ్యంతరం చెప్పారు. ఇక ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నేత కునాల్‌ సారంగి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంలో పడుతోందని బీజేపీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ ఆదిత్య సాహు అన్నారు. పిల్లల మనసులో చిన్నపటి నుండి విషాన్ని నింపి వాళ్ళని దేశ విద్రోహులుగా తీర్చి దిద్దుతున్నారు అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news