అంగన్ వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ : సీఎం రేవంత్ రెడ్డి

-

అంగన్ వాడీల  ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖపై అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు. కేంద్రాలకు సొంత భవనాలపై దృష్టి సారించాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్ వాడీ  కేంద్రాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా.. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news