బీజేపీలో ఆ రెండు స్థానాలకు తీవ్ర పోటీ.. టికెట్​ ఎవరికి దక్కేనో?

-

భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీ టికెట్ల కేటాయింపు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ, మహబూబ్​నగర్​, మల్కాజిగిరి ఎంపీ టికెట్ల ఖరారుపై పీఠముడి నెలకొన్నట్లు సమాచారం. సీనియర్​ నేతలు ఎవరికి వారు తమకే టికెట్ కేటాయించాలని పట్టుబట్టడంతో రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. మహబూబ్​నగర్, మల్కాజిగిరి అభ్యర్థిత్వాలను అధిష్ఠానమే తేల్చాలని పేర్కొంటున్నట్లు సమాచారం. తొలి విడతలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఖరారు ఉండకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.

BJP-party

మహబూబ్​నగర్ ఎంపీ టికెట్​ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆశిస్తున్నారు. తనకే టికెట్​ కేటాయించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ సీనియర్​ నేత, మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి కూడా ఎంపీ టికెట్​ను ఆశిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన​ గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపథ్యంలో తనకే ఎంపీ టికెట్​ కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది.

సీనియర్​ నేతలు ఈటల రాజేందర్​, మురళీధర్​ రావు, వీరేందర్​ గౌడ్​, పాల్వాయి హరీశ్​రెడ్డితోపాటు ఢిల్లీ పభ్లిక్​ స్కూల్​ సంస్థల అధినేత మల్క కొమురయ్య సైతం టికెట్​ను ఆశిస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం సీనియర్​ నేతలు ఈటల రాజేందర్​, మురళీధర్​ రావు మధ్యలోనే ఉంది. ఈటలకు కేంద్ర హోంమంత్రి ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. అయితే, బీజేపీ మధ్యప్రదేశ్​ రాష్ట్ర ఇన్​చార్జి అయిన మురళీధర్​ రావుకు తెలంగాణ సీనియర్​ నేతలు సపోర్ట్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్​ వస్తుందనేది సస్పెన్స్​ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news