జస్టిస్ ఫర్ జయరాజ్ ఫెనిక్స్..! ఈ ఘటన జార్జ్ ఫ్లాయిడ్ ను మించిపోయింది..!

-

justice for jayaraj and fenix
justice for jayaraj and fenix

మొన్న జార్జ్ ఫ్లాయిడ్ నేడు జయరాజ్ ఫెనిక్స్ లు.. ఇంకెందరు అవ్వాలి ఈ పోలీస్ జులుంకు బలి..? ఇదెక్కడి పైశాచికత్వం ఇదెకడి దౌర్జన్యం..? పోలీస్ అధికారులు బాధ్యతలు వహించమంటే హుకూం చలాయిసున్నారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా మానవత్వాన్ని మరిచిపోయి హత్యలు చేస్తున్నారు. ఓ సాదారణ తండ్రి కొడుకులను విచక్షణారహితంగా చితకబాది వారి మరణానికి కారణం అయ్యారు. ఒక్కరోజులో తండ్రి కొడుకుల ప్రాణాలు పొట్టనబెట్టుకొని బాధిత కుటుంబ పొట్టనుగొట్టారు. ఈ ఘటన తమిళనాడు లోని సతన్ కులం పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను అమలు చేసింది. తమిళనాడులోని సతన్ కులం ప్రాంతంలో నివాసం ఉండే జయరాజ్ (59) అతని కుమారుడు ఫెనిక్స్ (31) మొబైల్ షాప్ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. జూన్ 19 న లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికి వారు నియమాలు ఉల్లంఘించి షాప్ తెరిచే ఉంచారు దీన్ని గమనించిన సతన్ కులం పోలీసులు జయరాజ్ ఫెనిక్స్ లను విచక్షణారహితంగా చితకబాదారు. 59 వయసున్న వృద్ధుడని కనికరం కూడా లేకుండా కేవలం కొన్ని నియమాలు ఉల్లంఘించినందుకు స్పృహ కోల్పోయెంతవరకూ చితకబాదారు. దీంతో వారిని దగ్గరలోని కోవిల్ పట్టి ఆసుపత్రులకు తరలించగా చికిత్స పొందుతూ జూన్ 22 న కొడుకు ఫెనిక్స్ ప్రాణాలు విడిచాడు, తండ్రి జయరాజ్  పరిస్థితి కూడా క్షీణించి మరునాడు జూన్ 23 న ఆయన కూడా  మృతిచెందాడు. కేవలం 24 గంటల పరిదిలో రెండు ప్రాణాలను కోల్పోయిన కుటుంబం దుక్కసాగరంలో మునిగిపోయింది. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ క్రుంగిపోతున్నారు, ఈ ఘటన పై ఇప్పటికే పెద్ద స్థాయిలో నెటిజన్లు సానుభూతిని వ్యక్తం చేస్తుండగా సెలబ్రిటీలు సైతం తమ తమ సానుభూతులను సామాజిక మాధ్యమాల ద్వారా తేలియజేస్తున్నారు. ఈ దుర్మార్గమైన చర్యను తప్పుబడుతున్నారు. అందరూ ఒక్కటై ఈ దుశ్చర్యను ఎదుర్కోవాలని వారు కోరుతున్నారు. నిందితులకు శిక్ష పడాలంటు శిక్ష పడేదాకా తమ పోరాటాన్ని ఆపబోమని తెలుపుతున్నారు.

కాగా వారిని విచక్షణా రహితంగా చితకబాదిన పోలీసులు వీరేనంటూ మరి కొన్ని పోస్టులు వచ్చాయి

Read more RELATED
Recommended to you

Latest news