రాజమౌళి ట్వీట్ : మహిష్మతిలో కూడా మాస్కులు..!

-

దేశ వ్యాప్తంగా కరోనా భయంతో ప్రజలు వణికి పోతున్నారు.  మాస్క్, శానిటజైర్ జీవితంలో ఒక బాగం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాస్కు ఓ కవచంలా కరోనా వైరస్ సోకకుండా కాపాడుతుందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ఇళ్లలోనే సేఫ్ గా ఉండాలని పలువురు ప్రముఖులు పిలుపునిస్తుండగా..టాలీవుడ్ జక్కన్న రాజమౌళి స్టే హోం బీ సేఫ్ అంటూ ఓ ఆసక్తికర వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దాన్లో బాహుబలి-2 చిత్రంలో క్లైమాక్స్ సీన్ లో హీరో విలన్ లు మాస్కులు ధరించి కనిపిస్తారు. ఇప్పుడు మహిష్మతిలో కూడా మాస్కులు ధరించాల్సిందే అంటూ కింద స్క్రోల్ అవుతుంటుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో RRR మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news