కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్‌డీ) ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణకు గాను మార్గదర్శకాలను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే విద్యార్థులు నిత్యం ఎంత సేపు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ పీసీల స్క్రీన్లను చూడాలో కూడా తెలిపింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులు నిత్యం 30 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పాటు స్క్రీన్లను చూడరాదు.
ఇక 1 నుంచి 8 తరగతి వరకు చదివే విద్యార్థులకు 45 నిమిషాలకు ఒక పీరియడ్‌ను నిర్వహించాలి. ఇలాంటి పీరియడ్లను వరుసగా రెండు నిర్వహించవచ్చు. అలాగే 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు 45 నిమిషాల పీరియడ్ టైంతో 4 పీరియడ్లను వరుసగా నిర్వహించవచ్చు.
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ పై వివరాలను ఈ సందర్బంగా వెల్లడించారు. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై స్కూళ్ల యాజమాన్యాలు పైన తెలిపిన సూచనలు పాటించాల్సి ఉంటుంది.