జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు కేంద్రం ఆమోదం

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తు్న్న సంగతి తెలిసిందే. అయితే… ఈ వైరస్‌ కు ప్రస్తుతం అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ తయారువుతోంది. ఇక మన దేశంలో ఇప్పటికే రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ఒకటి కోవాగ్జిన్‌ కరోనా టీకా కాగా.. మరోకటి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌.

అయితే.. ఈ టీకాల ఉత్పత్తి ఉన్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో విదేశీ టీకాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జాన్సన్ ఆండ్ జాన్సన్ సింగిల్ డోస్ కరోనా  టీకాకు కేంద్ర ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో త్వరలోనే జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ మన దేశంలో అందుబాటులోకి రానున్నది. జాన్సన్ ఆండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version