మన దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల వెలుగు చూడటం తో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఓమిక్రాన్ వేరియంట్ ను ఎలా ఎదర్కొవ డానికి రంగం సిద్ధం చేస్తుంది. అందులో భాగం గా దేశం లో ని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకారం.. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది.
అలాగే విదేశాల నుంచి వచ్చిన వారి పై 14 రోజుల పాటు నిఘ పెట్టాలని సూచించింది. అలాగే అన్ని రాష్ట్రాల లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ను పెంచాలని ఆదేశించింది. అలాగే అన్ని ఆస్పత్రు లలో మౌళిక సదుపాయాలను మెరుగుపరచాలని రాష్ట్రాల కు సూచించింది. కరోనా నిబంధనలను ప్రజలు తప్పకుండా పాటించే విధం గా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ పై ప్రజలకు అవగహన కల్పించాలని సూచించింది.