యుకె ప్రయాణంపై కేంద్రం గుడ్ న్యూస్

-

కొత్త కరోనా దెబ్బకు బ్రిటన్ వెళ్ళాలి అంటే చాలు జనాలు భయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా బ్రిటన్ తో విమాన ప్రయాణాలను రద్దు చేసిన పరిస్థితి మనం చూసాం. చాలా దేశాలు ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చిన వారి కోసం గాలం వేసాయి. భారత్ కూడా రద్దు చేసింది. ఈ నేపధ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జనవరి 8 నుంచి భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య విమానాలు పాక్షికంగా తిరిగి ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం తెలిపారు.

“2021 జనవరి 8 నుండి భారతదేశం మరియు యుకె మధ్య విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని నిర్ణయించామని” అని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ప్రారంభంలో, జనవరి 23 వరకు, రెండు దేశాల విమానాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు మరియు హైదరాబాద్ నుండి మాత్రమే వారానికి 15 విమానాలకు అనుమతులు ఇచ్చామని అన్నారు. అంటే ప్రతి దేశ క్యారియర్‌ లకు వారానికి 15 విమానాలకు మాత్రమే అనుమతి.

అంటే భారతీయ క్యారియర్లు – ఎయిర్ ఇండియా మరియు విస్టారా – వారానికి 15 విమానాలు మాత్రమే నడిపే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ క్యారియర్లు – బ్రిటిష్ ఎయిర్‌వేస్ మరియు వర్జిన్ అట్లాంటిక్ – వారానికి 15 విమానాలు వస్తాయి. రెండు దేశాల మధ్య విమాన కార్యకలాపాలకు సంబంధించిన మరిన్ని వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇండియా, యుకె మధ్య విమానాలు డిసెంబర్ 23 న నిలిపివేసారు.

Read more RELATED
Recommended to you

Latest news