కేంద్రం సంచలన నిర్ణయం; ఇక నుంచి స్కూల్స్ లో అవి తప్పని సరి…!

-

కేంద్ర యువజన సర్వీసుల శాఖ పాఠశాల యాజమాన్యాలకు సంచలన ఆదేశాలు జారి చేసింది. స్కూల్ లో ప్రతీ విద్యార్ధికి యోగా ప్రవేశం ఉండాలని చెప్తూ ప్రతీ రోజు వ్యాయామం చేయాలని, అందుకు విధి విధానాలను కూడా విడుదల చేసింది. యోగా ద్వారా విద్యార్థులు ఎంతో చురుకుగా తయారవుతారని, జ్ఞాపక శక్తి మెరుగు పడుతుందని, ఇందులో భాగంగా ఫిట్‌ ఇండియా ఫిట్‌ స్కూల్‌ విధానం అమలు చేయాలని ఆదేశించింది.

ఫిట్‌ ఇండియా ఫిట్‌ స్కూల్‌ విధానం ద్వారా పాఠశాలల్లో ప్రతి రోజు అమలు చేయాల్సిన కార్యక్రమాలు;

సోమవారం; నిపుణులతో యోగా, వ్యాయామం చేయడంతో పాటు శారీరక దృఢత్వం కోసం అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ. మంచి పోషకాహారాన్ని నిత్యం తీసుకోవాలని పోషకాహార నిపుణుల సలహాలు.

మంగళవారం; ప్రార్థన సమయంలో విదార్దుల్లో కొంతసేపు కచ్చితంగా కాళ్లు, చేతులు ఆడిస్తూ వ్యాయామం. క్రీడా అధ్యాపకులతో పాఠశాల్లో విద్యార్థులు ఆటలు ఆడడం వలన, క్రీడలతో మానసిక ఆరోగ్యం ఎలా సాధ్యమవుతుందో తెలిపే విధంగా ప్రసంగాలు.

బుధవారం; వ్యాయామ ఉపాధ్యాయులు ‘ఖేలో ఇండియా యాప్‌’ను అనుసరిస్తూ అందులో పేర్కొన్న శారీరక దారుఢ్యం పెంపొందించుకునే చిట్కాలను వివరించడంతో పాటుగా… వాల్ పోస్టర్లను ఉపయోగించి విద్యార్థులకు యోగా గురించి, ఆటల గురించి వివరించడం.

గురువారం; నృత్యం, ఏరోబిక్స్, ఆత్మరక్షణ విద్యలు, యోగాసనాలు, తాడుతో ఎగురుడు ఆటలు, స్కిప్పింగ్, తోట పనుల్లో శిక్షణ. వారి కోసం క్రీడా పోటీలను నిర్వహించడం.

శుక్రవారం; ఆటలు, వ్యాయమం పట్ల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించడం. కొత్త రకం వ్యాయామ కార్యక్రమాలపై సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేసి వాటిలో ప్రావీణ్యం పొందేలా చేయడం.

శనివారం; నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయించడంతో పాటుగా ఆటలు ఆడించడం. కబడ్డీ, బొంగరాలు తిప్పడం, దొంగ పోలీస్‌ ఆట, కుప్పిగంతులాట, వేగంగా నడవడం, పరుగెత్తడం, పుస్తకాలలోని పాఠ్యాంశాలను మనో పఠనంతో వేగంగా చదవడం ద్వారా కంటికి వ్యాయామం కలిగించినట్లవుతుందని, నిపుణులు భావించి వీటిని ఆటవిడుపుగా నిర్వహించాలని ఆదేశాలు జారి చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version