ఏసీల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం

-

భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లో రిఫ్రిజిరేటర్లతో ఎయిర్ కండీషనర్లను (ఎసి) దిగుమతి చేసుకునే అవకాశం లేదు. భారత్ వాటిపై నిషేధం విధించింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఆ తరహా ఎసీలను భారత్ లో తయారి పెంచడానికి గానూ ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.

ఈ ఏడాది వివిధ రంగాల్లో స్వావలంబన కోసం ప్రభుత్వం ముందుకు రావాలని నిర్ణయం తీసుకుంది. ఇక అప్పటి నుంచి కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మన దేశంలో విదేశాల నుంచి 30 శాతానికి పైగా డిమాండ్ లో విదేశాల నుంచి వచ్చేవే కీలక పాత్ర పోషిస్తున్నాయి. జూలైలో ప్రభుత్వం వివిధ కలర్ టీవీ సెట్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

దీనిని నిపుణులు చైనాకు పెద్ద దెబ్బగా చెప్తున్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి గానూ ఈ నిర్ణయం తీసుకున్నారని, దీని వలన ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అయ్యేవి ఆగిపోతాయని అంటున్నారు. ఎయిర్ కండీషనర్ల దేశీయ మార్కెట్ 5-6 బిలియన్ డాలర్లుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దిగుమతిపై నిషేధం విధించడంతో దేశంలో ఇప్పుడు తయారి ఊపు అందుకుంటుంది. ఇక కేంద్రం మూడు నెలల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో రక్షణ ఉత్పత్తి యొక్క తయారి పెంచడానికి ఆగస్టులో 101 వస్తువులపై దిగుమతి ఆంక్షను ప్రవేశపెట్టింది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news