గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే కృష్ణ కిశోర్ క్యాట్ ను ఆశ్రయించడంతో సస్పెన్షన్ పై స్టే విధించారు. తాజాగా, ఈ వ్యవహారంలో విచారణ కొనసాగించిన క్యాట్ ఏపీ సర్కారుపై మండిపడింది. కృష్ణ కిశోర్ వేతన బకాయిలు ఇంకా ఎందుకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యదర్శిని పిలిపించమంటారా? అంటూ సూటిగా అడిగింది.
ఆపై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. దాంతో ఏపీ సర్కారు వెంటనే ఆ ఐఆర్ఎస్ అధికారి వేతన బకాయిలను చెల్లించింది. ఆపై మధ్యాహ్నం విచారణలో భాగంగా ఇవాళే వేతనం చెల్లించినట్లు ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు. జాప్యం ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని సీఎస్‌కు క్యాట్ ఆదేశింది. వాదనలు వినిపించేందుకు లాయర్ ప్రకాష్‌రెడ్డి సమయం కోరారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.