Union Budget 2025: రూ.53 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ?

-

Union Budget 2025: రూ.53 లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్ ఉంటుందట. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో ఇవాళ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ లో రైతులు, పేదలు, మహిళలు, యువత పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

nirmala sitharaman in parliament

ఈసారి బడ్జెట్ లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సహాయం చేయనుంది.  ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ. 53 లక్షల కోట్ల మేరకు కేంద్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఆర్దిక సంవత్సరం (2023-25) కేంద్ర బడ్జెట్ 48 లక్షల 20 వేల కోట్ల రూపాయలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశల మధ్య ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news