హుజూరాబాద్ లో దిగిన 20 కంపెనీల కేంద్ర బలగాలు !

-

హుజూరాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక కోసం ఏకంగా 20 కంపెనీల కేంద్ర బలగాలను దింపనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే హుజూరాబాద్‌ కు 3 కంపెనీల బలగాలు చేరుకున్నాయి. ఒకట్రెండు రోజుల్లో హుజూరాబాద్ రానున్నాయి మిగతా బలగాలు. ఇక అటు హుజూరాబాద్‌ లో ఇప్పటి వరకు రూ.1.80 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హుజూరాబాద్‌లో రూ. 6.11 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

హుజూరాబాద్ ఉపఎన్నిక కు మరో వ్యయ పరిశీలకుడిని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను దించనుంది. అటు హుజురాబాద్ లో ఇప్పటి వరకు మొదటి డోస్ కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్లు 97.6 శాతంగా ఉంది. అలాగే 2 వ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్ల సంఖ్య 59.9 శాతం గా ఉంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కి దాదాపు వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయింది. కాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30 న జరుగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news