చంద్రబాబు ఫ్లెక్సీ కి వైసీపీ నేతల అంత్యక్రియలు..!

ఏపీలో వైసీపీ… టీడీపీ నేతల బాహాబాహి కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ కార్యాలయాలపై… నాయకుల ఇళ్ళపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు అంటూ టిడిపి నేతలు 36 గంటల నిరాహార దీక్షకు దిగగా… వైసీపీ నేతలు ముఖ్యమంత్రి ని తిట్టారు అంటూ ప్రజా ఆగ్రహ దీక్ష పేరుతో నిరసనకు దిగారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. దాంతో పాటు విచిత్ర నిరసన కార్యక్రమాలతో టిడిపి వైసిపి నేతలు హోరెత్తిస్తున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతిలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీ కి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రబాబు ప్లెక్సీ పై పూలదండలు వేసి ఊరేగించారు. అంతే కాకుండా ఓ వ్యక్తికి దుస్తులు వేసి అతని ముఖానికి లోకేష్ మాస్క్ మరియు వెనకాల లోకేష్ ఫోటో ముందు పప్పు లోకేష్ అని రాసి అతడి చేత చితికి నిప్పంటించారు. డప్పు చప్పుళ్లు… డాన్సులు… ఊరేగింపులు అచ్చం అంత్యక్రియలు చేసిన మాదిరిగానే ఈ నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది.