“అంకుశం”సినిమాలో రామిరెడ్డిని బట్టలూడదీసి కొట్టినట్టు కొడతాం : యరపతినేని

చంద్రబాబుని కాదు.. రెండో వైపున్న లోకేషుని చూడండి.. మాడి మసైపోతారు జాగ్రత్త అంటూ టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యాలయంపై దాడి వెనుక డీజీపీ హస్తం ఉంది.. అందుకే సీఐ నాయక్ పార్టీ కార్యాలయానికి వచ్చారన్నారు. పదవి దిగాక గౌతమ్ సవాంగ్ పరిస్థితేంటో ఆలోచించుకోవాలని.. ఏ ఒక్కర్నీ వదిలేదే లేదని హెచ్చరించారు.

అధికారంలో కొచ్చిన 24 గంటల్లో అందరి భరతం పడతామని.. అంకుశం రామిరెడ్డి ని సినిమాల్లో బట్టలూడదీసి కొట్టినట్టు కొడతామని హెచ్చరించారు యరపతినేని సీఎం జగన్ ఏదో అంటే బీపీ వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారంట… గతంలో చంద్రబాబును దుర్భాషలాడితే మాకూ బీపీ రాలేదనుకుంటున్నారా..? అని ఫైర్ అయ్యారు.

తాడేపల్లి కొంపను కూల్చాలని మా కార్యకర్తలు అంటున్నారు.. కానీ ఆ కొంప ఇప్పటికే కూలింది.. ఆ అవసరం లేదన్నారు. మేమూ మీ భాష మాట్లడగలం.. ఏంట్రా నా కొడకల్లారా అని అనగలం కానీ సంస్కారం అడ్డు వస్తోందని పేర్కొన్నారు. వైసీపీని గోయ్యి తీసి పాతేందుకు ప్రణాళిక వేసుకున్నామని.. చంద్రబాబు మంచిగా ఉండొచ్చు కానీ.. టీడీపీలో అందరూ చంద్రబాబు అంత మంచిగా ఉండరన్నారు. వైసీపీ నేతల తరహాలో బరితెగించే వాళ్లూ మా దగ్గరా ఉన్నారని హెచ్చరించారు సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్.