కేంద్రం గుడ్ న్యూస్; ఇక పోస్ట్ ఆఫీసుల్లో కూడా పిఎఫ్

-

కరోనా ఆర్ధిక కష్టాల నేపధ్యంలో కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి గానూ ప్రముఖ పొదుపు పథకం అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF సబ్ పోస్ట్ ఆఫీసుల్లో కూడా అందుబాటులో ఉంచాలని నిర్ణయం వెల్లడించింది. ఈ మేరకు… పీపీఎఫ్ స్కీమ్‌ను సింగిల్ హ్యాండెడ్ సబ్ పోస్ట్ ఆఫీసులకు పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

తక్షణం ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని తన ప్రకటనలో పేర్కొంది. చిన్న మొత్తాల్లో ఎక్కువ వడ్డీ దీనికే వస్తుంది. ప్రస్తుతం వార్షికంగా 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి గానూ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, సుకన్య సమృద్ధి యోజన-SSY లాంటి ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డిపాజిట్ రూల్స్‌ని కాస్త సులభతరం చేసింది.

అకౌంట్ హోల్డర్లు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిపాజిట్లను 2020 జూన్ 30 లోగా జమ చేయొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, సుకన్య సమృద్ధి యోజన-SSY ఖాతాదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎప్పుడు చేసే విధంగా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఖాతాదారులు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరుగా డిపాజిట్లు చెయ్యాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news