మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలను చూస్తే… కేరళలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా వున్నాయి.
ఇక పోస్టుల వివరాలలోకి వెళితే… మొత్తం 45 టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా వున్నాయి. అర్హత వివరాలను చూస్తే.. బీఎస్సీ(కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్/ కెమికల్ టెక్నాలజీ) పూర్తి చేసుండాలి.
ఇక వయస్సు విషయానికి వస్తే.. వయసు 35 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు వివరాలను చూస్తే.. రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉండి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎంఎస్సీ అభ్యర్థులకు ఫీజు లో మినహాయింపు ఉంది. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు 16-11-2022ని చివరి తేదీ. అప్లై చేసుకోవాలని అనుకునే వారు https://fact.co.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.