రంగ మార్తాండ:బ్రహ్మానందం ఫోటోస్ సూపర్ గురూ..!!

-

చాలా రోజుల తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీ నటులు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ సినిమా తో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో కృష్ణవంశీ చాలా టైమ్ తీసుకొని కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ సినిమా కు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు.ప్రకాష్ రాజ్ తర్వాత  మరో ముఖ్య  పాత్ర చేస్తున్న బ్రహ్మానందం ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. తెల్ల షార్ట్ , తెల్ల చొక్కా వేసుకున్న బ్రహ్మీ సోఫాలో కాళ్ళు ముడుచుకొని చాలా సింపుల్ గా వుండి డబ్బింగ్ చెబుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోస్ అభిమానుల మనసు దోచుకుంటున్నాయి.ఈ సినిమా లో తనది సీరియస్ గా వుండే పాత్ర అని తెలుస్తుంది. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో  వేచి చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version