వందల కొద్దీ ఉద్యోగాలు..! అప్లై చేశారా లేదా..?

-

ఊరికే ఉద్యోగాలు రావడం లేదని చింత పడుతూ కూర్చోవడం కాదు.. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం.. చాలామంది అందరూ అప్లయ్ చేసే పాపులర్ ఉద్యోగాల వైపే చూస్తారు కానీ.. విస్తృతంగా ఉన్న అవకాశాలను అధ్యయనం చేయరు.

అలాంటి కొన్ని ఉద్యోగాల అవకాశాలు గురించి తెలుసుకుందాం..

రిజర్వ్ బ్యాంకులో గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 199 ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి అర్హత బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ అక్టోబరు 11.

దిల్లీ సబార్డినేట్ సర్వీసుల్లో 982 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. వీటికి అర్హత ఇంటర్, డీఈఎల్ ఈడీ, ఇంజినీరింగ్ డిగ్రీవీటికి దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ అక్టోబరు 15.

డీఆర్డీవో సెప్టమ్ లో 224 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. వీటికి అర్హత పదోతరగతి, ఇంటర్మీడియట్.. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ అక్టోబరు 15..

నార్తర్న్ రైల్వేలో 118 ఎంటీఎస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు అర్హత పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ అక్టోబరు 15.

ఈసీఐఎల్‌లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు ఉద్యోగాలు ఉన్నాయి. సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ అక్టోబరు 11.

బొకారో స్టీల్ ప్లాంట్‌లో 463 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాల్లో కొన్నింటికి పదో తరగతి, ఇంకొన్నింటికి అప్రెంటిస్, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి. వీటికి దరకాస్తు చేసుకునేందుకు చివరితేది అక్టోబరు 11.

ఈ ఉద్యోగాలన్నింటికీ అక్టోబర్ 10, అక్టోబర్ 15 చివరి తేదీలుగా ఉన్నందున అభ్యర్థులు త్వరపడాలి. మిగిలిన వివరాల కోసం ఆయా సంస్థల వెబ్ సైట్లను పరిశీలించాలి.

Read more RELATED
Recommended to you

Latest news