అక్క‌డ జ‌గ‌న్ టీడీపీని ఖాళీ చేసేస్తున్నారుగా..!

-

ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలో బలవంతంగానో… పనుల కోసమో… కాంట్రాక్టుల కోసమో వైసీపీని వీడి టిడిపిలోకి వెళ్ళిన వారందరూ ఇప్పుడు రివ‌ర్స్ జంప్‌ చేస్తున్నారు. టిడిపి చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో ఆ పార్టీలో ఉండి చేసేదేం లేదు అని డిసైడ్ అయిన నేతలందరూ వరుసపెట్టి ఫ్యాన్ కింద సేదతీరేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో టిడిపి ఈ ఎన్నికల్లో ఒక విశాఖ జిల్లాలో మాత్రమే ప్రభావం చూపింది. విశాఖ నగరంలో ఉన్న నాలుగు సీట్లలోను టిడిపి అభ్యర్థులే విజయం సాధించారు.

ఇక ఇప్పుడు టీడీపీలో రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌న భావించిన వారు… గ‌తంలో టీడీపీలోకి వెళ్లిన వారు ఇప్పుడు ప‌శ్చాత్తాపంతో వెన‌క్కు వ‌స్తున్నారు. కీల‌క‌మైన విశాఖ జిల్లాలో చూస్తే ఏజెన్సీలోనే ఇద్ద‌రు కీల‌క నేత‌లు వైసీపీ ఎంట్రీ కోసం రెడీగా ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి రావాల‌నుకుని మ‌రీ జ‌న‌సేన‌లోకి వెళ్లి ఓడిన మాజీ మంత్రి ప‌సుపులేటి బాల‌రాజు ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఆయ‌న జ‌గ‌న్ అర‌కు ఎంపీ సీటు ఇస్తాన‌న్న జ‌న‌సేన‌లోకి వెళ్లి రాంగ్ స్టెప్ వేశారు.

ఇక వైసీపీలోనే రాజకీయంగా పుట్టి ఎమ్మెల్యే అయిన గిడ్డి ఈశ్వరి సొంత గూటికి చేరాలని తహతహలాడుతున్నారని అంటున్నారు. ఆమె వైసీపీలో ఉండి ఉంటే ఈ సారి ఎస్టీ కోటాలో ఖ‌చ్చితంగా మంత్రి అయ్యేవారు. జ‌గ‌న్ వీరిద్ద‌రిని చేర్చుకుంటే ఏజెన్సీ అంతా వైసీపీ మ‌యం అవ్వ‌డంతో పాటు అక్క‌డ టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇక త్వ‌ర‌లో విశాఖ గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే, ఇటీవ‌ల జ‌న‌సేన‌కు రాజీనామా చేసిన చింత‌ల‌పూడి వెంక‌ట్రామ‌య్య‌ను కూడా పార్టీలో చేర్చుకోనున్నారు.

ఇక గ‌తంలో జ‌గ‌న్‌కు ఎంతో న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి కూడా వైసీపీ వైపు చూస్తున్నార‌ట‌. స‌బ్బం గ‌తంలో మేయ‌ర్‌గా ప‌నిచేశారు. ఇక కొణతాల రామక్రిష్ణకు అనుచరగణం రూరల్ జిల్లాలో ఉంది. ఆయనతో పాటు వచ్చి చేరే వారి వల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీకి అవకాశాలు బాగా పెరుగుతాయని అంటున్నారు. విజ‌య‌సాయిరెడ్డి ద్వారా వీరు వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు ఆస‌క్తితో ఉన్నారు. ఏదేమైనా జగన్ ఒకే అంటే ఓ పెద్ద నాయకుల బృందమే విశాఖ నుంచి వైసీపీలో చేరిపోతుందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news